బజిత్ పూర్లో విష్ణు చరణ్ భూయా, శారదాదేవీ అనే దంపతులు ఉండేవారు వారు నీలరుద్రమహాదేవ్ భక్తులు. శారదాదేవికి ఒకరోజు రాత్రి స్వప్నంలో "నేను మీ ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తాను" అని నీలరుద్ర మహాదేవుడు పలికారు. అలాగే 1896 మాఘపూర్ణిమనాడు ఆమె ఒక సుపుత్రునికి జన్మ నిచ్చింది. భయమెరుగని ఆ బిడ్డడి పేరు వినోద్. అందరూ ఆ బిడ్డడిని బుధా, జైనాథ్ అనే పేర్లతో పిలిచేవారు. అనంతరం ఆయన పేరు ప్రణవానంద అయింది.
ప్రతిదినం వారి ఇంట్లో ఒక ముంగిస దూరి పాలు త్రాగేది. బాలకుడైన వినోద్ తో తల్లి ఆ ముంగిసను పట్టుకోమన్నది, అతడు దగ్గరోలని అడవిలోకి వెళ్ళి ఆ ముంగిసను పట్టి తెచ్చి తల్లి ముందుంచాడు, ఆ తల్లి ముంగిసను చూచి, నవ్వి వదిలివేసింది. ఆమె ప్రతిరోజూ తులసీపూజ క్రమం తప్పకుండా చేసేది. పిల్లవాడైన వినోద్ కు ఆమె ఎందుకు అలా చేసేదో అర్థం కాలేదు. ఒకసారి మేడపై నుండి తులసి కోటలోకి ఒక వస్తును విసిరేశాడు. వెంటనే వెలుగు వచ్చి ఆ ప్రదేశంలో నారాయణుడు కన్పించా బాలకునకు. దాంతో ఆ తులసి కోటను దైవ ఆవాసంగా గ్రహించాడు. అంతేగాక తులసి ప్రాశస్త్యాన్ని అందరకూ చెప్ప నారంభించాడు.
ఆ బాజిత్ పూర్లో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. అది స్మశానం దగ్గరగా ఉండేది. పగటిపూట ఆ దిక్కుకేసి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. బాలుడైన మన వినోద్ ధైర్య సాహసాలతో ఆ మట్టిచెట్టును దాటి, రాత్రిపూట స్మశానానికి పోయి ధ్యానంలో కూర్చునేవాడు. జీవితం అంటే ఇంతే అని ఆ స్మశానం తెలిపింది. ఒక దుర్గాష్టమినాడు “అమ్మా! నీవే సత్యమైతే నాకు దర్శనమివ్వు" అని ఆ దుర్గామాత విగ్రహం కళ్ళలోనికి చూస్తూ కూర్చున్నాడు. అది ప్రగాఢమైన కోర్కె తల్లి మాత్రం కాదనగలదా? మందిర ప్రదేశమంతా వెలుగు విరజిమ్మింది. ఆమె అరమోడ్పు కన్నులు, కదులుతున్న చేతులు చూచాడు వినోద్. సింహవాహినితో పాటు సరస్వతి, గణేశుడు, కార్తికేయుడు సాక్షాత్కరించారు. ఆ దర్శనంతో ఆతనిలో ప్రశాంతత ఆవహించింది. జగన్మాత ఆతని శిరాన్నీ స్పృశించింది. అది చాలు అతనికి.
దాంతో చిన్నప్పటి నుండి భక్తితోపాటుగా, సేవానిరతి దినదినాభివృద్ది గాంచసాగింది, ఇతర పిల్లలతో పాటు ఆహారధాన్యాలను సేకరించి నిరు పేదలకు ఇచ్చేవాడు. అస్వస్థులకు ఊరట కల్గించేవాడు. మృతులను స్మశానవాటికకు మోసేవాడు. ఇవిగాక, దైవప్రార్థనలను చేసేవాడు...తోటి వారితో చేయించేవాడు. పేదవారిని, అనాథల చూసినప్పుడు బాధపడేవాడు. తన పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన వీరేంద్రలాల్ భట్టాచార్యతో తానింకా సేవా కార్యక్రమాలను, ఆధ్యాత్మిక చింతనను పెంచుకుందామని కోరుకుంటున్నానని, సాయం చేయమని కోరాడు. వీరేంద్రలాల్, బాబాగంభీరనాథ్ యొక్క శిష్యుడు.
అతనిని గంభీరనాథ్ వద్దకు తీసుకుపోయాడు. ఆయన, ఆ బాలకునిలోని ఆసక్తినీ, సామర్థ్యాన్ని గ్రహించాడు. తన వద్దనే ఉంచుకున్నాడు. తన శక్తిని ఆ కుర్రవానిలో ప్రవేశపెట్టాడు. అతనిచేత సాధనను చేయించసాగాడు. గురువు ఆదేశంతో కాశీలో యోగసాధన చేశాడు. ఒకనాడు వినోద్ తీవ్రంగా జ్వరం వచ్చి స్పృహ తప్పి పడిపోగా, ఒక వృద్ద మహిళ తల్లివలె వచ్చి పరి చర్యలు చేసింది. ఆమె ఎవరో కాదు, అన్నపూర్ణ అని అనంతరం గ్రహించాడు.
ఒకసారి శ్రాద్ధ కర్మల నిమిత్తం గయ చేరగా, పందాలు ఆయనను ఊపిరి సలుపనివ్వలేదు. ఇటువంటి పుణ్యక్షేత్రాలను పునరుద్దరించవలసిన ఆవశ్యకత గుర్తించాడు.1916 మాఘ పూర్ణిమ నాడు కదంబ వృక్షం క్రింద ఆయనకు ఆత్మజ్ఞానం అయింది. అర్థ కుంభమేళలో స్వామి గోవిందనాథ్ గిరిజీ ఆయనకు సన్యాస దీక్ష యిచ్చాడు. అప్పటి నుండి ఆయన ప్రణవానంద అయ్యాడు. 1917లో ప్రథమంగా బాజిపూర్లోనే భారత సేవాశ్రమ సంఘమును స్థాపించాడు. అది విశ్వవ్యాప్తమైంది. అది భారతజీవనాడిలో ఒక భాగమైంది.
ఇతర సంస్థలు చేపట్టని, మానవుని మరణానంతర కర్మకాండలను కూడా ఈ సంస్థ చేపట్టడం బహు విశేషం! ఆధ్యాత్మికతతో పాటు, సేవాభిలాష రుచిని చూపిన ప్రణవానందులు 08-02-1941 దేహాన్ని వదిలారు. ప్రణవానందుల సేవానిరతి మనందరకూ అలవడుగాక.

No comments:
Post a Comment