శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ.. ~ దైవదర్శనం

శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..




మహ మహిమాన్విత శివలింగ పుణ్యక్షేత్రం...
శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..
రాముడు నడియాడిన ... మల్లెంకొండ..!
సాహసం.. సౌందర్యం.. శ్రీమల్లెంకోండేశ్వరం.
నల్లమల, శేషాచల అభయారణ్యం మధ్య సీతారామలక్ష్మణులు నివశించిన రామసరిపేటు..
"రామసరిపేటు జలపాతం"లో స్నానం చేసొద్దామా...!
.
.
హిమాలయ పర్వతాల తర్వాత దక్షిణ భారతీయులు పవిత్రంగా భావించే కొండలు నల్లమలలు. నల్లమల అంటేనే పవిత్రమైన కొండలుగా భావిస్తారు. నల్లమల అభయారణ్యంలో ఎటుచూసినా పచ్చగా పెరిగిన చెట్లు.. చెట్లపై పక్షుల కిలకిలరావాలు.. ఎత్తైన కొండలు..కొండల నడుమ జాలువారే జలపాతాలు, గుండాలు.. సమీపంలో సోమశిల జలశం.. అక్కడక్కడ అడవిలో రకాల జంతువులు, పక్షులు కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తాయి. అడుగడుగునా ప్రకృతి రమణీయ దృశ్యాలతో కనువిందు చేస్తాయి.
.
చుట్టూ విశాలమైన అడవి.. ఎత్తైన చెట్లు.. ప్రకృతి అందాలు... పక్షుల కిలకిలలారావాలు... పాముల పుట్టలు... వన్యప్రాణులు.. దట్టమైన నల్లమల అడవిలోని ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం మరిచిపోయి ఇక్కడ కొలువైనాడు..! పున్నమి రాత్రి నట్టడవిలో వస్తున్నాం.. వస్తున్నాం.. మల్లెంకొండయ్యా అంటూ సాగే యాత్ర ఓ మధురానుభూతి..! ఇక్కడి రాయి, రప్ప, చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను అలుముకుని ఉంటాయి. లోతైన లోయలో కొలువుదీరిన మల్లీశ్వరుడిను చేరుకోవడానికి కాలినడకన 8 కిలోమీటర్లు తిరిగి కాలినడకన 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! నడవటం కష్టంగా అనిపించే దారిలో సాగే ఆ యాత్ర నిజంగా ఓ సాహసం.. సౌందర్యం..! ఆ ఆద్భుత స్థలమే మల్లెంకొండ...
.
సామాన్యులు మల్లెంకొండగా పిలుచుకునే శ్రీమల్లెంకోండేశ్వర స్వామి క్షేత్రం కడప జిల్లా, బద్వేల్ పట్టణం, గొపావరం మండలం, పి.పి. కుంట నుండి 15 కిలోమీటర్లు దూరం లోగల నల్లమల, శేషాచల అభయారణ్యం అడవిలో మల్లెంకొండ ఉంది. దట్టమైన అడవిలోని ఒక లోతైన మైదానం ఉంది. ప్రతీ సంవత్సరం కార్తీక మాసం, శివరాత్రి కి అధిక సంఖ్యలో ఈ క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. సాహసం చేయాలనే అభిలాష ఉన్నవారికి ఈ క్షేత్రదర్శనం మంచి అనుభూతిని కలిస్తుందనడంలో సందేహం లేదు. ఈ మల్లెంకొండలో దాదాపు 250 అడుగుల ఎత్తు రాతికొండ నుంచి రామసరిపేటు జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
.
సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!
.
పౌరాణికంలో మల్లెంకొండను గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా రామాయణంలో. రాముడు వనవాస సమయంలో ఇక్కడ కొద్ది నేలలపాటు రామసరిపేటు అనే ప్రాంతంలో కుటీరం ఏర్పరుచుకొని నివసించినట్లు మరియు తపస్సును ఆచరించి నల్లమల అడవి, శేషాచల అడవి మధ్య భాగంలో దాదాపు 14 ఎకరాల స్థలంలో చూట్టు కోటను నిర్మించి శివలింగాన్ని ప్రతిష్టించినట్లు చెబుతారు. ప్రతి నిత్యము శివునికి పూజలు, అభిషేకాలు నిర్వహించేవారు. ఈ ప్రదేశంలో సీతారామలక్ష్మణులు సంచరించినట్లు ఆనవాళ్లు భక్తులకు దర్శనమిస్తాయి. మల్లెంకొండలో బండరాతిపై రాముని పాదాలు, సీతాదేవి స్నానం ఆచరించిన కొలను, హనుమాన్ విగ్రహం, నంది విగ్రహంలు ఉన్నాయి. శ్రీరాముడు నివశించిన రామసరిపేటు కుటీరం ఉన్న చోట దాదాపు 10వేల మంది తలదాచుకునేంత విశాల మైదానం ఉండటం ఇక్కడి విశేషం...
.
మల్లెంకొండలో సాలుకోట, అశ్వశాల కోట, గజశాల, భజన శాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ గుండం, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు భక్తులను మరిపిస్తాయి. అంతే కాకుండా నల్లమల, శేషాచల అభయారణ్యం మధ్య సీతారామలక్ష్మణులు నివశించిన రామసరిపేటు వద్ద గల దాదాపు 250 మీటర్ల ఎత్తు నుంచి ప్రతి నిత్యం గలగలా సవ్వడి చేస్తూ, భక్తులను విశేషంగా ఆకట్టుకునే రామసరిపేటు జలపాతం కలదు. ఇక్కడ భక్తితో గోవిందా..! లేక శివా..! అని పలుకుతే ఎక్కడవున్న నీళ్ళ మీద పడుతాయి. ప్రకృతి సౌందర్యాలకు నిలయంగా భావించబడే ఈ జలపాతాన్ని పూర్వం "పార్వతి జలపాతం"గా పిలిచేవారట. ఈ జలపాతానికి చుట్టూ ఉండే అరణ్యంలో అన్ని జాతుల వృక్షాలు ఉండగా, ఎక్కువగా వనములిక చెట్లతో నిండి ఉన్నాయి. అలాగే అనేక రకాల జంతువులు, పక్షులు కూడా నివసిస్తున్నాయి. ఈ జలపాతం అడవుల గుండా ప్రయాణించి ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లను తాకుతూ ప్రవహిస్తాయి. అందువలన ఈ నీటిలో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు. చుట్టూ ఉండే కొండలు అతి సుందరంగా కనిపిస్తాయి..
.
తల్లి అంకమ్మ దేవత.. కొడుకు మల్లెంకొండయ్య.. చరిత్ర:..
.
ప్రాచీన భారతీయ సమాజం స్త్రీకి గౌరవనీయ స్థానం ఇచ్చింది. శక్తి స్వరూపిణులుగా, మాతృ మూర్తులుగా పూజించింది. పార్వతీ దేవి (దుర్గ)ని శక్తికి, లక్ష్మీదేవిని సంపదకు, సరస్వతి మాతను విద్యకు ప్రతిరూపంగా కొలుస్తున్నాం. మన దేశాన్ని కూడా భారత మాతగా పూజిస్తాం. వైదిక యుగంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు లేవు. చదువు, శక్తి సామర్ధ్యాల్లోనూ సమానత్వమే ఉండేది. అద్భుతమైన భక్తి పారవశ్యంలో మునిగి ఆ పరమ శివునికే తన జీవితాన్ని అంకితం చేసిన పరమ భక్తురాలు, అంకమ్మ దేవి గురించి తెలుసుకుందాం..
..
పూర్వం రాక్షస జాతికి చెందిన అర వీర భయంకరులు ఇక్కడి ప్రాంతాన్ని పరిపాలించేవారు. అంకమ్మ అనే రాజ వంశానికి చేందిన శివ భక్తురాలు కాశీ యాత్ర చేస్తూ ఉండగా ఇక్కడి సమీప అడవి ప్రాంతంలో మహిమాన్వితమై శివాలయం ఉందని తెలుసుకోని సమీప అడవి ప్రాంతానికి తనతో పాటు కాశీ యాత్ర చేస్తున్న కొంత మంది అనుచరులతో కలిసి సాయంత్ర సమయానికి అడవిలోని శివాలయానికి చేరుకొని శివునికి పూజలు నిర్వహించింది.
.
ఉదయం సమయంలో జలపాతంలో స్నానం అచరించి శివునికి పూజలు నిర్వహింస్తుండగా అక్కడికి రాక్షస జాతి మనసులు వచ్చి అంకమ్మను చిత్రహింసలు పెట్టి ఇక్కడి నుండి తక్షణమే ఈ శివాలయాన్ని వదిలి వెళ్ళలాని అదేశించినారు. నేను ఇక్కడ నుండి వెళ్ళను, ఎందుకు వెళ్ళలి అని అంకమ్మ రాక్షస జాతి మనసులతో అంటుంది.
అప్పుడు వారు అంకమ్మతో పాటు వచ్చిన కొంత మంది చంపండం జరుగుతుంది. అప్పుడు అంకమ్మ శివుని ప్రార్థించుతుంది ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు రాక్షసులను చంపమని శివుని వేడుకుంటుంది. అప్పుడు శివుడు తల్లి అంకమ్మ ఇప్పుడున్న అంశంలో నేను జన్మను ఇచ్చేవాడినే గాని సంహరించే వాడిని కాను అని అంకమ్మకు వివరిస్తాడు.
.
ఎలాగైన రాక్షస జాతిని అంతం చేయాలని కఠొరమైన క్రమశిక్షణతో యుద్ధ వ్యూహాలు, యుద్ధ విద్యలను నేర్చుకుని అంకమ్మ దేవి ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో పాత్ర ధరించి రాక్షస జాతిపై యుద్దనికి పోతుంది. ఎంతమందిని చంపిన ఎన్ని రక్తపు బోట్ట కింద్ర పడిన అంత మంది జన్మస్తున్నారు. రాక్షసులను సంహరించడం అంకమ్మ తల్లికి కావడంలేదు. రాక్షస జాతిని చంపడంలో విఫలం చెంది, అలసిపోతుంది.
ఇలాగైతే రాక్షస జాతిని చంపడం నావల్ల కాదని శివుని ధ్యానించింది అంకమ్మ తప్పస్సు కు మేచ్చి శివుని ప్రత్యక్షం అవుతాడు. ఆ భక్తురాలు ఆనందంతో పొంగిపోయి శివుడిని, తనకు ఒక బిడ్డను అనుగ్రహించమని అడుగుతుంది. శివుడు అనుగ్రహించగా ఆమెకు బిడ్డ పుడతాడు. ఆ పిల్లవాడికి మల్లెంకొండయ్య అని నామకరణంచేస్తురు. అల్లారు ముద్దుగా పెంచుకుంటు ఆపిల్లవాడికి అమ్మ అంకమ్మ దేవత సకల విధ్యాలు, కళలు నేర్పుతుంది. కాని, లోకం దృష్టిలో ఆమె దోషిగా నిలబడుతుంది. ఆమె బిడ్డ కూడా ఎదిగే కొద్ది తన తండ్రి ఎవరో చెప్పమని అడగగా, అతని పుట్టుకకు శివుని అనుగ్రహం కారణమని చెబుతుంది. ఆ పిల్లవాడు కఠోరమైన తపస్సు చేస్తాడు ఆ పరమ శివుని దర్శనం కోసం. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, అతని సందేహాన్ని తీరుస్తాడు. అతను కారణజన్ముడని, ఓ మహత్కార్యం నెరవేర్చాల్సింది ఉందని శివుడు ఆదేశిస్తాడు.
.
అమ్మ అంకమ్మ దగ్గరకు మల్లెంకోండయ్య పోయి అమ్మ నాకు సలకల విధ్యాలు నేర్పినావు కదా నా తక్షణ కర్తవ్యం ఎమిటి అని తన తల్లి అడుగుతాడు. అప్పుడు తల్లి చాల సంవత్సరాల నుంచి ఈ రాక్షసులు జనాలను, ఇక్కడ ఉన్న శివాలయానికి రాకుండా అడ్డుకోని హింసిస్తున్నారు. వారిని నీవు సంహరించాలని నాయన అని వివరిస్తుంది.
మల్లెంకొండయ్యకు సహయా సేవకుడైన పోతురాజును పిలిచి రాక్షసులను సంహరించాడానికి తగిన అయుధాలను తీసుకరమ్మని అజ్ఞాపిస్తాడు. అప్పుడు పోతురాజు యుద్దనికి కావలసినవి సమీప ప్రాంతనికి పోయి తీసుకోని వస్తాడు.
.
అప్పుడు తల్లి అంకమ్మదేవత, కోడుకు మల్లెంకొండయ్య రాక్షసులపై యుద్దని దిగుతారు. అప్పుడు గుర్రంపై సవారి చేస్తు ఖడ్గంతో రాక్షసుల తలలు నరుకు పోతుంటే మళ్ళి రాక్షసులు బ్రతుకుతు వస్తుఉంటారు. అప్పుడు అంకమ్మ తల్లి వారి జన్మ రహస్యన్ని గమనించి వారి రక్తపు చుక్కలను క్రింద పడకుండా అమే చేతిలోని రక్తపు పాత్రలో వారి రక్తపు బోట్టులను పట్టుకుంటుంది. అంకమ్మ తల్లి కూడ ఒక చేతిలోని త్రిశూలంతో పోడుస్తూ, ఒక చేతిలోని డమరుకంతో భయపెడుతూ, ఒక చేతిలోని ఖడ్గంతో నరుకుతూ, అవసరమైనప్పుడు రాక్షసులను కాళ్ళతో తోక్కుతు యుద్దం చేస్తూంది. అంకమ్మ తల్లి యుద్దం చేసేటప్పుడు రక్తపు చుక్కలు క్రింద పడకూండా తన కొస నాలుకు చాపి రాక్షసుల రక్తపు బోట్టులో జీవకణాన్ని చంపి వదిలేసేది. అమ్మ, కొడుకుల యుద్దానికి భయాబ్రతులు చేందిన రాక్షసు వారినుండి తప్పించు కావడానికి రాక్షసులకు మరో చేడ్డగుణం పరకాయ ప్రవేశం కలదు. చివరకు మల్లెంకొండయ్య చేతిలో చావడం కాయం అని ఇకా మన వంశం ఉండదని అలోచించి ఒక పందిలోనికి పరకాయ ప్రవేశం చేస్తురు. మల్లెంకొండయ్య అంకమ్మతో అమ్మ అందరిని సంహరించినాము కదా మనం ఇక్కడి నుండి వెళ్ళిపొదాం పదా అని అంటాడు. అప్పుడు అంకమ్మతల్లి నాయనా వారు అంతం కాలేదు వారు ఆ పందిలోనికి పరకాయ ప్రవేశం చేసినారు నీవు గనుక ఆపందిని చంపితే నీవు శివుని మహత్కార్యం నెరవేచ్చినవాడిఅవుతావు అని చేపుతుంది.
రాక్షసులంత పరకాయ ప్రవేశం చేసిన పందిని వేటాడాడానికి మల్లెంకొండయ్య వేట కుక్కలను తీసుకొని వేట మొదలు పెడుతాడు కొండ చివర అంచునుండి పందిని కొడితే ఆ పంది ఐదు భాగాలుగా చీలి ఐదు శివ లింగాలు పంచలింగాల కొనలో పడుతాయి. ఈ ఐదు శివలింగాలు కలిపి సోమశిలలొ పంచలింగాలకొన గా పూజలు అందుకుంటుంన్నారు.
.
రాక్షస సంహారం తరువాత అంకమ్మ దేవత కొడుకును వెంటపెట్టుకోని శివాలయం పోయి శివుని ప్రార్ధంచగా శివుడు ప్రత్యక్షమైనప్పుడు శివునితో స్వామి మీ క్షేత్రాన్ని నీకు అప్పుగిస్తున్నాము ఇకా మాకు సేలవు ఇప్పించడి అని వెడుకోగా అప్పుడు శివుడు ఇన్ని సంవత్సరాలు రాక్షసుల పరిపాలోవుండే ఈ కొండను ఇంత ప్రవిత్రంగా చేసి నాకు అప్పచేప్పి మీరు ఎక్కడికి పోతారు మీరు ఇక్కడేవుండి మీరు నా తన పైగాన కుటిరం ఎర్పటు చేసుకొని నాకు పూజలు, అభిషేకాలు నిర్వహించండి, ఇక్కడి వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి అపదా రాకుండా వారిని రక్షించండి, ఇకా నుంచి ఈ పవిత్రమైన ఈ అడవిని నీపేరు మీదుగా మల్లెంకొండ పిలువబడుతుంది. అని శివుడు అంకమ్మను మల్లెంకొండయ్యలకు వివరిస్తాడు.
.
అప్పుటి నుంచి ఈ ఆలయం మల్లెంకొండేశ్వర స్వామిగా పిలువ బడుతున్నది. శివలింగం మీద పోసిన అభిషేక జలం దాని మధ్యలో ఉన్న రంధ్రం గుండా సీతమ్మ గుండంలో కలుస్తుయి. ఇక్కడి ఆలయానికి పైకప్పు ఉండదు ఎందుకంటే చుట్టు దట్టమైన అడవి కాబట్టి కారుచికటి అలుముకోని వుంటుంది. పూర్వం వచ్చే భక్తులకోసం శివుని శివలింగం నుంచి వచ్చే వెలుగులో భక్తులు, సకల జీవరాసులురాగాల హాయిగా కాసేపు సెద తీరేవారు. అప్పుటి నుంచి ఎంత మంది వచ్చి స్వామివారికి పైకప్పు వేసినా మల్లెంకొండయ్య స్వామి పడకోటేవాడు. కార్తీక మాసం లో ప్రతి రోజు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొండల మధ్య చరియ లో ‘’తేజో వంత మైన కాంతి ‘’ కనిపించటం విశేషం. ఈ వెలుగును పరమ శివుని శివ జ్యోతి గా భక్తులు నమ్మతారు. అంతే కాకుండా కొండ శిఖరాన ఒక పెద్ద కొట కలదు. కొట ప్రక్కన కొలను కలదు ఇక్కడ దాదాపు 100 గుర్రాలు ఓకెసారి నీళ్ళ త్రాగే విధంగా ఒక పెద్ద రాతి పలకపై దొని మొలిచారు.
.
ముస్లింల పరిపాలనలోనే హిందూ ఆలయాలపై దాడులు నిర్వహించి ఆలయాలను సర్వనాశనం చేసేవారు. మల్లెంకొండలోని శివాలయాన్ని కూడా పెక్కిలించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల రాజు సోదరుడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు అచ్యుతరాయలు రాజుగారు 1535 సంత్సరంలో అచ్యుతరాయల బావమరుదులైన సలకం పెద తిరుమలరాజు, సలకం చిన తిరుమరాజులతో కలసి మల్లెంకొండలో మాహిమానిత్వతమైన శివాలయాన్ని దర్శించి మట్టి గొడలు నిర్మంచి పున:ప్రతిష్ట చేసినాడు. అంతే కాకుండ స్వామివారికి వజ్రకీరీటం, బంగారు గంటలు బాహుకరించినాడు. ఈ ఆలయాన్ని కాకతీయులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు, మట్టి రాజులు, రాష్ట్రకూటులు, అర్వాచీన గాంగులు మొదలగు రాజ వంశీయులు మల్లెంకొండలొని శివాలయాన్ని దర్శించి స్వామివారికి కానులు సమర్పించినారు. ఇలా రాజులు సమర్పించిన ధనాన్ని ఒక గుహలో దాచి ఉంచారని వజ్రా వైదూర్యలు, మణి, మాణిక్యలు కలిగిన ఆ నిధికి మల్లెం కోండేశ్వర స్వామి కాపలా కాస్తున్నాడని చరిత్రకారులు చేపుతారు.
.
2010లో డీబీర్స్‌ అనే సంస్థ వజ్రాలు, యురేనియం నిక్షేపాల కోసం నల్లమల, శేషాచల అడవిలో సర్వేలు, భూపరీక్షలు నిర్వహించింది. ఇక్కడి కొండల్లో చాల విలువైన వజ్రాలు, యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు వెలుగు చూశాయి. అంతే కాకుండా లక్షలు విలువ చేసే కజ్రాలు ఇక్కడ లభించడం జరిగింది. మల్లెంకొండయ్య స్వామిలయాన్ని చూసి తీరాల్సిందే. ఇక్కడి ప్రకృతి కాశ్మీర్‌ను తలపిస్తుంది. చెట్ల మహావృక్షం కూడా మనలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎత్తైన కొండలు, లోయలు, పచ్చని ఎత్తైన అడవులతో ఎనలేని ఆనందాన్నిస్తుంది. 

https://www.facebook.com/rb.venkatareddy/media_set?set=a.10213114933700791&type=3
.
రచన..
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి..
Don't Copy-Paste This Story
All Copyright Reserved 2017
https://www.facebook.com/rb.venkatareddy
RB. VENKATA REDDY
reddemb@gmail.com
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List