జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం... ~ దైవదర్శనం

జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం...

జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...
.
Sri Jyothi Siddeshwara Swamy Temple, Jyothi Village, Siddhavattam,Kadapa district ,Andhra Pradesh.
.
https://www.facebook.com/media/set/?set=a.10213268819027828.1073741869.1617578507&type=1&l=5b0e90d5eb
.
https://www.facebook.com/rb.venkatareddy/posts/10213268820227858

.
రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

కడప జిల్లాలోని సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో పెన్నా నది ఒడ్డున ఇసుకలో కప్పబడి ఉన్న 108 శివాలయాల ఆలయాన్ని వెలికితీశారు, ఈ ఆలయం 1100 వ సంవత్సరానికి చెందినది గా గుర్తించారు. 108 శివాలయాలు గల ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది.

ఈ 108 శివాలయాలు గల దేవాలయాన్ని రక్కసి గంగారయదేవ అనే రాజు మరియు అయన అంగరక్షకుడు అయిన జంటిమనాయకుడు 11 శతాబ్దంలో నిర్మించారని ఆ తరువాత ముస్లిముల పాలనలో ఇసుకతో పూడ్చి వేసారని ఈ పవిత్రమైన యాత్ర స్థలాన్ని శ్రీశైలానికి ఉన్న నాలుగు ద్వారములలో జ్యోతి కూడా ఒక ద్వారము. ఆలంపూర్ , త్రిపురాంతకం మరియు ఉమామహేశ్వరం మిగతా మూడు ద్వారాలు.
.
ప్రసిద్ద చరిత్రకారుడైన మేక్కేంజి ఈ ఆలయాన్ని 1806వ సంవత్సరంలో దర్శించారు. చరిత్ర పరిశోధకుడైన రోబర్ట్ సీవెల్ 1878 వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని సందర్శించారు. పురావస్తుశాఖ ఆద్వర్యంలో జరిపిన తవ్వకాల్లో సుమారు 6 దేవాలయాలు ఇంకా చతుర్ముఖ శివలింగం, సూర్యుని విగ్రహం మరియు నాగ శిలలు బయటపడినాయి, వీటిని దశాబ్దాల క్రితమే చెన్నై మ్యూసియంకు తరలించారు. శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఉత్తర ముఖంగా ఉంటుంది. ఈ ఆలయములోని శిలా శాసనమును బట్టి కాకతీయ రుద్రమ్మ దేవి వెండి రథము, వజ్రపు కిరీటం ఈ ఆలయమునకు బహూకరించినట్టుగా తెలుస్తోంది.
.
ప్రస్తుతం ఈ ఆలయం లోపలి భాగం మాత్రం పటిష్టంగా ఉన్నా బయట నుండి మాత్రం ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా అత్యంత దయనీయ స్థితిలో ఎటువంటి అభివృద్ది పనులకు నోచుకోకుండా అధికారుల నిర్లక్ష్యానికి నిలువేత్తు సాక్ష్యంలా నిలిస్తోంది, ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడా కానీ పురావస్తుశాఖ ఆనవాళ్ళు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడం గమనార్హం... స్థానిక ప్రజలే ఈ ఆలయ ఆలన పాలన చూస్తున్నారు. ఎంతో మహిమాన్వితమైన ఈ దివ్య క్షేత్రం ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తే పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుంది. ఇక్కడికి చేరుకోవడానికి కడప నుండి సిద్దవటం చేరుకుంటే అక్కడి నుండి జ్యోతి గ్రామానికి ఆటోలు వెళుతుంటాయి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List