పక్షము ~ దైవదర్శనం

పక్షము

పక్షము అనగా 15 రోజులకు (లేదా కచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి.

1. శుక్ల పక్షం : అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్ల పక్షం. శుక్ల అంటే తెల్లని అని అర్థం.
2. కృష్ణ పక్షం : పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణ పక్షం. కృష్ణ అంటే నల్లని అని అర్థం.

మహాలయ పక్షము

బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున ఉంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List