ద్వాదశ బావములు-వాటి ప్రాముఖ్యత ~ దైవదర్శనం

ద్వాదశ బావములు-వాటి ప్రాముఖ్యత

జాతకుడు బాగుండాలంటే, జాతకుని యొక్క తనూ భావము (లగ్నము) బాగుండాలి. తనూ భావము బాగుండాలంటేవ్యయ స్థానము (ద్వాదశ భావము ) బాగుండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యయము చేయగలగాలంటే బాగాలాభాలు లేదా సంపాదన బాగుండాలి. అంటే లాభ స్థానము (ఏకాదశి భావము) బాగుండాలి. లాభాలు లేదా సంపాదనబాగుండాలంటే వృత్తికి సంబందించిన
(దశమ భావము) బాగుండాలి. వృత్తి అనగా, వ్యాపారము కావచ్చు, ఉద్యోగముకావచ్చు, నైపుణ్యము కావచ్చు. దశమ భావము బాగుండాలంటే, అందుకు అతడు లేదా అతని తల్లిదండ్రులు ఎంతోపుణ్యము చేసుండాలి. ఇందుకు నవమ భావము బాగుండాలి. నవమ భావము బాగుండాలంటే, జాతకుడు ఎంతోకష్టపడాలి, ఇబ్బందులను ఎదుర్కోవాలి. దీనికి అష్టమ భావము (ఆకస్మిక ధన లాభము, స్పెకులేషన్ మొ. కూడా) బాగుండాలి. అష్టమ భావము బాగుండాలంటే సప్తమ భావము (కళత్రము, సంబందాలు, రిలేషన్స్) బాగుండాలి. సప్తమ భావము బాగుండాలంటే శత్రు, రోగ, ఋణ స్థానము (6వ భావము) బాగుండాలి. అందుకు జాతకుని యొక్కఆలోచన సరళి, సంతానము (పంచమ భావము) బాగుండాలి. అందుకు తల్లి ప్రేమ, సౌఖ్యము, విద్య, ఆహారనియమాలు మొ. (చతుర్ధ భావము) తోడ్పడుతుంది. దానికి అందరి సహకారము (తృతీయ భావము) కావాలి. సహకారము పొందాలంటే ధనము, మంచి వాక్కు (ద్వితీయ భావము) కలిగి ఉండాలి.

ద్వాదశ భావాలలో ఒక భావమునకు మరొక భావమునకు అంతర సంబందము కలిగి ఉంటుంది. కావునజాతకులు మంచి వాక్కు, నడవడి, ప్రవర్తన కలిగి ఉండాలి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List