షాద్బలలు ~ దైవదర్శనం

షాద్బలలు

షాద్బలాలు అంటే గ్రహాల యొక్క బలం ఉచ్చ నీచ శత్రు మిత్ర  క్షేత్రము ఉన్న  గ్రహాల  బలాన్ని నిర్ణయించదానికి శద్బలం అంటారు.
షద్బలాలూ ఆరు రకాలు,
1 స్తానబలము
2 దికబలము
3 కాలాబలము
4 చేష్టబలము
5 దృకబలము
6 నైసర్గికబలము

ఒక్కక్క దాని గురించి తెలుసుకుందాము

1 స్తానబలము--ఒక గ్రహాన్ని చూసిన వెంటనే ఆ గ్రహానికి చెందిన బలము ఉచ్చ, మిత్ర,,స్వక్షేత్రము,మూలాత్రికోనము,స్వ డ్రెక్కానము, స్వనవంశ,,వంటి శుభ వర్గుల్లో ఉన్న గ్రహము నీచ నుండి ఉచ్చ కు పోయే గ్రహము షోడశ వర్గు రిత్యా బలము పొందిన గ్రహాలు స్థాన బలము.
స్థాన బలము ఐదు రకాల బలాల సముదాయము.
1- ఉచ్చబలము
2-సప్తవర్గజ బలము
3-ఓజయుగ్మ రాశ్యంశ బలము
4-కేంద్ర బలము
5-డ్రెక్కనబలము

2.దిగ్భలం

1.బుధ- గురువులు (తూర్పు) లగ్నంమందు వుండిన బలవంతులు.

2.రవి-కుజులు (దక్షిణం) దశమునందు బలవంతులు.

3. చంద్ర-శుక్రులు(ఉత్తరం) చతుర్థంలో బలవంతులు

4.  శని(పశ్చిమం) సప్తమునందు బలవంతుడు .

3 -కాల బలం

1. సంవత్సరాధిపతి, మాసాధిపతి, దినాధిపతి మరియు హోరాధిపతి బలవంతులు.

2. శుభగ్రహములు శుక్ల పక్షమునందు మరియు పాప గ్రహములు కృష్ణ పక్షమునందు బలవంతులు.

 3. రవి గురు శుక్రులు పగటి యందు బలవంతులు.
చంద్ర కుజ శని రాత్రియందు బలవంతులు
బుధుడు పగలు రాత్రి యందు కూడ బలవంతుడు.

.4--జేష్టా బలం

ఆయణ బలం

రవి చంద్రులు ఉత్తరాయణ రాశులైన మకరంనుండి మిథునం దాక వున్న బలిష్టులు.

కుజ-బుధ-గురు-శుక్ర -శని వక్రగతిలో నున్నప్పుడు మరియు చంద్రునితో యుతి చెందినపుడు బలిష్టులు.

పై గ్రహములు రవితో యుతి చెందినపుడు అస్తంగత దోషమేర్పడి బలహీనులగుదురు.

అస్తంగతము గ్రహమునకు రవికి వుండు దూరాన్ని బట్టి నిర్ణయించాలి.

5- దృక్బలము

శుభ గ్రహ వీక్షణ వల్ల కలిగే బలము ధనము గుర్తు (+)
పాప గ్రహ వీక్షణ వల్ల కలిగే బలము ఋణము గుర్తు (౼)

6. గ్రహముల నైసర్గిక బలము

శనికంటే కుజుడు; కుజుని కంటే బుధుడు ; బుధుని కంటే గురువు; గురువు కంటే శుక్రుడు; శుక్రుని కంటే చంద్రుడు; చంద్రుని కంటే సూర్యుడు బలాడ్యులు.

నైసర్గిక బలములో అతి తక్కువ బలము కలది శని.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List