శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ~ దైవదర్శనం

శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం”

తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.
ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”. కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. .ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List