కోరింత దగ్గు నయం కావడానికి శునక విగ్రహానికి పూజలు.... ~ దైవదర్శనం

కోరింత దగ్గు నయం కావడానికి శునక విగ్రహానికి పూజలు....

అనంతపురం జిల్లాలో తమ పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి సైతం శునక విగ్రహానికి పూజలు చేస్తున్నారంటే వారు మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసిస్తున్నారో ఇట్టె అర్థమవుతుంది. హిందూపురంలోని ఎస్‌.సడ్లపల్లిలో బెంగళూరు రోడ్డు పక్కనవున్న శునక విగ్రహానికి దశాబ్దాల చరిత్ర ఉంది. గతంలో ఈ గ్రామంలో ఉన్న ఓ సాధువు చిన్న చితక వైద్యం చేసేవాడు. ఆయన పెంపుడు కుక్క చనిపోతే దానిని సమాధి చేశాడు. ఆ శునకంతో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా శునక విగ్రహాన్ని ప్రతిష్టింపజేశాడు. ఈ విగ్రహానికి పూజలు చేస్తే చిన్నపిల్లలకు వచ్చే కోరింత దగ్గు నయమవుతుందని ఇక్కడి ప్రజల గట్టి విశ్వాసం. ఇక్కడ పూజలు నిర్వహించడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాక కర్ణాటక నుంచి భక్తులు రావడం విశేషం.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List