శంభాజీ. ~ దైవదర్శనం

శంభాజీ.


కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ని కీర్తించిన‌ ‘‘ శంభాజీ ’’
.
శంభాజీ రాజే భోంస్లే (మే 14, 1657 – మార్చి 11, 1689) మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు. శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు.
శంభాజీ అతని సలహాదారు కవికలష్‌లను ఔరంగజేబు సేనాని ముకర్రబ్‌ఖాన్‌ సంగమేశ్వర్‌ వద్ద కుట్రచేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లూ, పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి, ఇస్లాంలోకి మారితే శంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు వెుఘల్‌ చక్రవర్తి. తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ని కీర్తించాడు శంభాజీ. దాంతో వారిని నలభై రోజులపాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లూ పీకారు. బతికుండగానే చర్మం వలిచారు. ఏం చేసినా మతం మారననీ ఒక్కకోటనూ స్వాధీనం చేయననీ ధైర్యంగా చెప్పాడు. చివరకు మార్చి 11, 1689న అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని ముక్కలుముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడికి దగ్గరలోని వధు గ్రామస్తులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమసంస్కారాలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదం ఉన్నట్టే శంభాజీని ధర్మవీర్‌ గా గౌరవిస్తారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List