మూడువేళ ఏళ్ళక్రితం తిరుమూలర్ తిరుమంత్రం అనే కావ్యాన్ని రచించారని చెప్తారు. అది శైవ మతం మరియు తాత్త్వికత యొక్క ఆచరణీయ/ వ్యవహారిక మరియు సిద్ధాంతపరమైన అంశాలను వెళ్ళడిస్తుంది. పతి (శివుడు), పశు (జీవుడు) మరియు పాశము (బంధము) గురించిన పురాతన పద్ధతిని ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ క్రింద చెప్పేది తిరుమంత్రంలో తిరుమూలర్ యొక్క వ్యాఖ్యానం.
భగవంతుడు మాత్రమే గురువు. అతడే శివుడిని లేదా సత్ ను చూపిస్తాడు. సత్-గురు అంటే అంబలం లేదా చిదాకాశ శివుడు. నువ్వు గురువు కోసం నీ హృదయంలో వెతకాలి. జ్ఞానం, భక్తి, పవిత్రత మరియు సిద్ధులు గురువు అనుగ్రహంతో ప్రాప్తిస్తాయి. పవిత్రత, వైరాగ్యం మొదలైనవి ఉన్న సాధకులలో అనుగ్రహం ఉదయిస్తుంది.
ఆర్తి/ కుతూహలంతో ఉన్న సాధకుడు గురు పరం నుంచి సహాయం తీసుకోవాలి. గురు పరం సాధకునకు ఆధ్యాత్మిక సూచనలు ఇస్తారు. అప్పుడు శుద్ధ గురువు అతనిపై దైవానుగ్రహాన్ని అనుగ్రహిస్తాడు. సాధకునకు దైవానుగ్రహం లభించగానే అతనికి అనేక శక్తులు, పవిత్రత, మంత్రాలను తెలుసుకునే శక్తి, ఉన్నతమైన సిద్ధులు మొదలైనవి లభిస్తాయి. అప్పుడు చిదాకాశంలో సద్గురువు తానుగా చిదాకాశంలో వ్యక్తం/ ప్రత్యక్షమై మూడు బంధాలైన అణవ (అహంకారం), కర్మ మరియు మాయ ను త్రెంచి, అతడు అపరిమితమైన నిత్యానంద స్థితికి లేదా మోక్షానికి ప్రవేశించేందుకు సాయపడతారు. తర్వాత శివగురు తానుగా వ్యక్తమై సత్, అసత్, సదసత్ వ్యక్తమవుతాయి. జీవుడు ఈ అంతిమమైన జ్ఞానం పొందగానే, అతడు శివుడవుతాడు. ప్రారంభ మరియు అంతిమ దశల్లో వ్యక్తమైన గురువు సాక్షాత్తు శివుడే.
స్వామిని తన హృదయ కుహరంలో, రెండు కనుబొమ్మల మధ్య మరియు శిరస్సున ధ్యానించినప్పుడు, భక్తుడు స్వామి అనుగ్రహాన్ని పొందుతాడు. స్వామి యొక్క పవిత్ర పాదాలు ఎంతో స్తుతింౘదగ్గవి. " స్వామి పవిత్ర పాదాలే నాకు మంత్రము, సౌందర్యము మరియు సత్యము" అంటారు తిరుమూలర్.
జ్ఞేయం అనగా తెలుసుకోదగినది ఏదంటే, అది శివానందం, శివుడు మరియు ఆయన శక్తి (అనుగ్రహం) యొక్క సారం. జ్ఞాత (తెలుసుకునేవాడు) జీవుడు లేద జీవాత్మ. అతడు శివానందంలో ఉండటం చేత శివుడిని తెలుస్కుని, జ్ఞానాన్ని పొందుతాడు.

No comments:
Post a Comment