రాహు మహాదశ - ఫలితములు ~ దైవదర్శనం

రాహు మహాదశ - ఫలితములు

ఒక జాతకునికి రాహు మహా దశ ఎలా వుంటుంది. మంచి ఫలితాలను ఇస్తుందా లేదా ఎలా నిర్నయించాలి?

రాహు మహాదశ యోగించాలంటే

1) రాహువు 3,6,10,11 స్థాన స్థితి కలిగి ఉండాలి (వీటిని ఉపచయ స్థానాలు అని కూడా అంటారు)
2) రాహువు మకర, కుంభ కన్య రాశులలో ఉండాలి
౩) రాహువు ఉచ్చ స్థానం లో ఉండాలి
4) రాహువు యందు మంచి స్థాన బలము కలిగిన శుభ మరియు ఉచ్చ గ్రహ దృష్టి/వీక్షణ
5) మంచి స్థాన బలము కలిగిన గ్రహములతో రాహు సంయోగం కలిగి వుండాలి (ఉదా:  కేంద్రాధిపత్య శని తో ఒకే ఇంట్లో వుండడం)

రాహువు కి ఉచ్చ/నీచ స్థానములు ఏవి అనే విషయం లో కొన్ని తేడాలు వున్నాయి.
సర్వార్థ చింతామణి ప్రకారం మిథున/ధనుస్సులు గాను పరాశర హోరా శాస్త్రం ప్రకారం వృషభ/వ్రుస్చికాలు) గాను చెప్పబడినది

రాహు దశలో రాహువు ఇచ్చే ఫలితాల క్రమం ఈ విధంగా వుంటాయి

1)  రాహువు తను వుండే రాశి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది
2)  రాహువు తో సంయోగం చెందిన గ్రహం యొక్క స్థాన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది (ఉదా: మీనా లగ్న జాతకులకు రాహువుతో పాటుగా రవి (6 వ అనగా సింహం స్థానాధిపతి)  వుంటే ఆ స్థానం ( రుణ రణ శత్రు రోగ) సంబంధిత ఫలితములు మరియు సూర్య సంబంధ (అధికారము , ప్రభుత్వ పదవులు)  ఇవ్వడం జరుగుతుంది
3)  రాహువు ఏ నక్షత్రం లో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి సంబంధిత ఫలితములు ఇవ్వడం జరుగుతుంది

మంచి స్థితి కలిగిన జాతకునికి రాహుదశ లో జరిగే ముఖ్య సంఘటనలు

1) ఆకస్మిక ధన లాభం
2) విదేశీ యానం
౩) త్వరిత గతిన జీవితమునకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం
4) త్వరిత గతినపేరు ప్రఖ్యాతులు రావడం
5) ఊహకు అందని లేదా అనితర సాధ్యమైన విషయాలను అధ్యయనం చేయడం లేదా కనుకొనడం
6) ముందు ఎన్నడూ ఊహించని కలగానని స్థితికి (అన్ని విషయాలో) చేరుకోవడం

రాహు మహాదశ అంతయూ మంచి గా కానీ చెడుగా కానీ వుండదు. కారణం రాహు దశలో అంతర్దశ ఫలితాలు ఆయా గ్రహ స్థితి ఉచ్చ నీచ ను బట్టి వుంటాయి అని మరిచిపోకూడదు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List