దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అన్న దాని వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి ? ~ దైవదర్శనం

దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అన్న దాని వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి ?

దేవుడి ముందు దీపారాధన చేసేటప్పుడు మనం దీపానికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తాము :
దీపజ్యోతి పరబ్రహ్మ
దీపజ్యోతి జనార్ధనా
దీపోమి హర తు పాపం
దీపా జ్యోతిర్ నమోస్తుతే |
దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది.
దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం.

తమసోమా జ్యోతిర్గమయా...అన్నారు. తామస్ అంటే చీకటి.
ఓ పరమాత్మా...
అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుతురులోకి తీస్కేల్లమని.
దీపారాధన చేయడం వలన అజ్ఞానమనే చీకటి తొలగి జ్ఞానమనే వెలుతురు ప్రసరిస్తుంది.

ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది

సౌజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యొజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే
శ్రేష్ఠమైన నేతిలో మూడు వత్తులతో వెలుగొందుచూ, మూడులోకాల యొక్క గాడాంధకారాన్ని పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించి సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు.

జాతో బ్రహ్మకులే గ్రజోధనపతిర్యః కుంభకర్ణానుజః
పుత్రః శక్రజితః స్వయందశిశిరః పూర్ణాభూజా వింశతిః
స్వేచ్ఛః కామచరోరథాశ్వవిజయీమధ్యేసముద్రంగృహం
సర్వం నిస్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్భలే
బ్రహ్మదేవుని వంశంలో జన్మించినప్పటికీ, కుబేరుని అన్నగా కలిగి ఉన్నప్పటికీ, కుంభకర్ణుడనే బలశాలి తమ్మునిగా ఉన్నప్పటికీ, ఇంద్రుని జయించిన ప్రతిభాశాలియైన ఇంద్రజిత్తు కుమారునిగా ఉన్నప్పటికీ, పదితలలు, ఇరవై చేతులు కలిగి ఉన్నప్పటికీ, ఆకాశగమనాది సిద్ధులు పొంది ఉన్నప్పటికీ, దుర్భేద్యమైన లంకాపట్టణానికి అధిపతియై ఉన్నప్పటికీ, గొప్ప గొప్ప రథాలు, గుర్రాలు, అస్త్రశాస్త్రాలను కలిగి ఉన్నప్పటికీ, చిత్తశుద్ధిలేని కారణం చేత మనోమాలిన్యం తొలగని కారణంచేత, కామాడులకు హృదయంలో ఆశ్రయం కల్పించినందువల్ల, లోపలి చీకటిని పోగొట్టుకోలేనందున రావణుడు తన జీవితాన్ని నిష్పలం చేసుకున్నాడు.

కాబట్టి మనిషిలో అజ్ఞానాన్ని, హార్దిక తమస్సును పారద్రోలగల జ్ఞానజ్యోతి అంత్యంతావశ్యకమైయున్నది. 
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List