గడప'పై కూర్చోకూడదు.. నిలబడకూడదు..ఎందుకంటే? ~ దైవదర్శనం

గడప'పై కూర్చోకూడదు.. నిలబడకూడదు..ఎందుకంటే?

ఇంటికి ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిది కాదని ఇంట్లో మన పెద్దలు నిత్యం చెబుతుంటారు. అలా కూర్చుంటే అరిష్టం, దారిద్య్రం అని హెచ్చరిస్తుంటారు. ఇంతకూ అది నిజమా? మూఢ నమ్మకమా? చాలా మందికి ఈ విషయం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది. అయితే మన పెద్దలు అలా ఎందుకు అనేవాళ్లంటే.. కిటికీలు, ద్వారాల ద్వారానే గాలి, వెలుతురు ఇంటిలోకి వచ్చి వెళ్తూంటాయి. అలాంటప్పుడు గడపపై కూర్చుంటే ఇంట్లోకి వచ్చే గాలిని, వెలుతురును అడ్డుకోవడమే అవుతుంది. అలాగే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని బయటకు తీసుకెళ్లే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదట. ఇలాచేయడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదట.

ఇక ఆధ్యాత్మికపరంగా చూసుకుంటే.. గడపకు మధ్యలో కూర్చోవడం మంచిది కాదు. గడపపై కూర్చోవడం, గడపకు దిగువనున్న మెట్లపై కూర్చోవడం కూడా అంత మంచిది కాదు. అలా కూర్చుంటే ఇంటిలోనికి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్టేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి, నవరత్నాలు, పంచలోహ వస్తువుల్ని ప్రధాన ద్వారమైన  గడప కింద ఉంచడం ఆనవాయితీ. అందుకే ప్రధాన ద్వారాన్ని దైవాంశంగా, లక్ష్మీదేవిగా పూజిస్తాం. కాబట్టి దైవాంశం నిండిన ప్రధాన ద్వారం (గడప)పై కూర్చోవడం.. లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది. అందుకే మన పూర్వీకులు గడప పైన కూర్చోవడమే కాదు తొక్కడం, ఎక్కి నిల్చోవటాని కూడా వద్దని చెప్పేవాళ్ళు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List