యోగపరంగా ఔన్నత్యాన్ని పొందిన సాధకుడు భవిష్యత్తులోకి తొంగి చూడటం సాధ్యమే.మామూలుగా చాలామందికి ఈ స్ఫురణశక్తి సహజంగా జన్మతః ఉంటుంది.దానిని ధ్యానాభ్యాసంతో వృద్ధి చేసుకోగలిగితే భవిష్యత్తులోకి చూడటం పెద్ద గొప్పవిషయం ఏమీకాదు. అయితే ఇటువంటి సిద్ధుల కోసం అదే పనిగా పాకులాడకూడదు. మన దారిలో మనం ముందుకు సాగుతుంటే వాటంతట అవి వస్తూ,పోతూ ఉంటాయి అని మహనీయులు చెబుతారు. సహజంగా/యోగ సాధన ద్వారా వచ్చిన ఈశక్తిని, యోగ-ధ్యానాభ్యాసాల ద్వారా బాగా వృద్ధి చేసుకుంటే జరుగబోయే విషయాలు చాలా ముందుగానే తెలిసిపోతుంటాయి. బాగా అభ్యాసం వచ్చిన తర్వాత మనమే భవిష్యత్తులోనికి తొంగి చూడవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా సాధ్యమే. కాకుంటే దీనికి సాధన అవసరం. రోజూ కనీసం రెండు గంటలు నుండి ఐదు గంటలు ధ్యానానికి వినియోగించగలిగితే ఇది సాధించటం తేలికైన విషయమే. ఉన్నత లోకాల వ్యవస్థ కూడా పరిచయం అవుతుంది.






No comments:
Post a Comment