చల్లని చూపుల తల్లి! ~ దైవదర్శనం

చల్లని చూపుల తల్లి!

కాళిదాసు రచించిన ‘శ్యామలాదండకం’ అర్థాన్ని, విశేషంగా, విశ్లేషణాత్మకంగా, జీవితానికి ఉపయోగపడే విధంగా తెలుసుకుందాం.

మాణిక్యవీణా ముఫలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసామ్‌!
మాహేన్ద్ర నీలద్యుతి కోమలాంగీమ్‌
మాతంగకన్యాం మనసా స్మరామి!!
శ్యామలాదేవి మాతంగ కన్య. మాతంగుల జీవనవిధానం ఎలా ఉంటుందంటే రెక్కాడితేగానీ డొక్కాడదు. గంటలు గంటలు పూజలు చేయడానికి వారికి సమయం ఉండదు. అందుకే శీఘ్రఫల దేవతలను వాళ్లకు అప్పగించారు. వాళ్ల జీవనశైలి ఉంటుందో దేవతల జీవనశైలి అలాగే ఉంటుంది. శ్యామలా దేవి చేతిలో చూడండి. వీణ ఉంటుంది. దాన్ని ‘ఏకతార’ అంటారు. ‘మాణిక్యవీణ’ అంటే అదే. భక్తిపారవశ్యంలో ఎప్పుడూ మత్తు ఎక్కువ ఉండాలి. మత్తు అంటే సేవించడం వల్ల వచ్చే మత్తుకాదు. మాతంగులు బాగా శ్రమపడతారు. ఆ శ్రమ వల్ల అలసట చెందుతారు. అదే రూపంలో అమ్మవారు ఉంటారు. ఇంద్రనీలమణిలా కోమలమైనటువంటి కాంతులు కలిగి ఉంటారు.

చతుర్భుజే చన్ద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమ రాగశోణే!
పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ
హస్తే నమస్తే జగదేకమాతః!!
అమ్మవారిని స్మరించడంలో మనస్సు ప్రధానం. లలితాదేవి సహా అమ్మవారి రూపాలన్నింటిని చూడండి. నాలుగు భుజాలుంటాయి. చతుర్విధ పురుషార్థాలను మనం సాధించాలని చెప్పడానికే ఆ నాలుగు భుజాలు. శ్రీమహావిష్ణువుకు కూడా నాలుగు భుజాలుంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో నువ్వు ధర్మంగా ఉండు. ఆ ధర్మంతోనే ధనాన్ని సంపాదించుకో. ధర్మంగా సంపాదించిన దాంతో నీ కోరికలు తీర్చుకో. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకు. అదే మోక్షం! నాలుగు దిక్కుల నుంచి నీకు ఏ ఆపద వచ్చినా కాపాడతాను! అని అమ్మవారు చెప్పడానికే నాలుగు చేతులు. మాతంగీదేవి అమ్మవారికి నెత్తిన చంద్రుడు ఉంటాడు. ఆ తల్లి చల్లని చూపులు మనందరినీ రక్షించు గాక!
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List