గ్రహాలరీత్యా శరీర భాగాలు. ~ దైవదర్శనం

గ్రహాలరీత్యా శరీర భాగాలు.

జాతకుని శరీరభాగములలో ఏభాగము పరిపుష్టి కలిగి ఉండునో,ఏభాగము బలహీనంగా ఉండునో,ఆయా రాశులయందు ఉన్న గ్రహాములయొక్క శూభా శుభములను బట్టి తెలియును.
కాలపురుషుని అవయవ విభాగము మేషాదిగా చూచినట్లుగానే జాతకుని అవయవ విభాగము లగ్నము నుండి చూడవచ్చును.
కాలపురుషుని అంగములు లగ్నము నుండి మొదటి ఆరు రాశులు కుడివైపు భాగమును,ఏడవరాశి నుండి పన్నెండో రాశి వరకు ఎడమవైపు భాగమును చూడవలెను.

ఆయారాశుల్లో పాపగ్రహాలు కాలపురుషుని ఏశరీరభాగమున్న స్ధానంలో స్ధితి నొందాయో ,లగ్నాదిగా అదే అంగభాగంలో కూడ పాపాగ్రహాలు చేరి ఉన్నప్పుడు అట్టి అంగం బలహీనపడి వ్యాధిగ్రస్ధమవుతుంది.ఇందు గ్రహా కారకత్వాదులను కూడ అన్వయించి చూడాలి.

రాశులరీత్యా శరీరభాగాలు

శ్లో:-మేషోశ్శిరోదవదనం వృషబో విధాతః
వక్షోభవేనృమిధునం హృదయం కుళీరం.
సింహస్ధదోధరమదో యువతిః కటిశ్చ.
వస్తిస్తు లాభృదదేవమేహ నమష్టమస్యాత్.
దన్వీచస్వాదూరుయుగం నక్రోజానుయుగంత
జంగద్వయంచ కుంభస్యా త్పాత ద్వితీయ మత్స్యభం.

మేషరాశి:-శిరస్సు,మెదడు ను,
వృషభరాశి:ముఖాన్ని,గొంతు,మెడ,టాన్సిల్స్,కన్నులు,ముక్కు,నాలుక,వేళ్ళగోళ్ళు,
మిధునరాశి:-ఉదరాన్ని,చేతులు,చెవులు,
కర్కాటకరాశి:-హృదయం,స్తనాలు,
ఊపిరితిత్తులు
సింహారాశి:-పొట్ట,గుండె,వెన్నుపూస,
కన్యారాశి:-నడుం,చిన్నప్రేవులు,
ఆహారనాళం.

తులారాశి:-పొత్తికడుపు,మూత్రపిండాలు,
వృశ్చికరాశి:- జననాంగాలు,(బాహ్య జననేంద్రియాలు)
ధనస్సు రాశి:-తొడలు,తుంట,
మకర రాశి:- మోకాళ్ళు,
కుంభరాశి:- పిక్కలు,చీలమండలు,
మీనరాశి:-పాదాలు.

గ్రహాలు శరీరభాగాలు

రవి:-శిరస్సు,హృదయం,కుడికన్ను,ఉదరం,ఎముకలు.
చంద్రుడు:-ఎడమకన్ను,శరీరంలోని ద్రవాలు,స్త్రీల పునఃఉత్పత్తి అంగాలు,
కుజుడు:-ఎముకలలో మజ్జ,హిమోగ్లోబిన్,పిత్తం,మెడభాగం,
బుధుడు:-గొతు,ముక్కు,ఊపిరితిత్తులు,
గురువు:-కాలేయం,పిత్తకోశం,చెవి,
శుక్రుడు:-ముఖం,పునః ఉత్పత్తి అంగాలు ,వీర్యం,ప్రేగులు,
శని:-కాళ్ళు,పాదాలు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List