కామాక్షీ దీపం గురించి తెలుసా? ~ దైవదర్శనం

కామాక్షీ దీపం గురించి తెలుసా?

కామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది. ఈ దీపానికి గజలక్ష్మీ దీపం అనికూడా పేరు. ఆ దీపపు వెలుగులో కామాక్షీ దేవి నిలిచి ఉంటుంది. కనుక కామాక్షీ దీపం అంటారు.

కామాక్షీ దేవి సర్వదేవతలకూ శక్తినిస్తుందని ప్రతీతి. అందుకే కామాక్షీ కోవెల తెల్లవారుఝామున అన్ని దేవాలయాలకన్నా ముందే తెరువబడి. రాత్రి పూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూయబడుతుంది. అమ్మవారి రూపమైన కామాక్షీ దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది.

కామాక్షీ దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు. తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్ళలో ఉండే ఆచారం.
కామాక్షీదీపం ఇళ్ళలో వ్రతాలూ పూజలూ చేసుకునేటప్పుడూ, అఖండ దీపాన్ని పెట్టదలచుకున్నప్పుడూ గృహప్రవేశం చేస్తున్నప్పుడూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కామాక్షీ దీపము కేవలం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది.
ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం.
కామాక్షీ దీపం వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం.

కామాక్షీ దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికీ కుంకుమ పెట్టి, పువ్వుతో అలంకరించి, అక్షింతలు  వేసి నమస్కరించుకోవాలి..
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List