బాలాజీ దర్శనం చేసుకున్నాను. ~ దైవదర్శనం

బాలాజీ దర్శనం చేసుకున్నాను.

శ్రీ శ్రీ పరమాచార్య స్వామివారు శుకబ్రహ్మ ఋషి అంతటి ఉన్నతులు. సాక్షాత్ పరమేశ్వర స్వరూపులైనప్పటికి ఆ విషయం తెలియపరచాకుండా మనల్ని అనుగ్రహిస్తున్నారు. కాని, ఈ విషయం ఎన్నోమార్లు నిరూపితమైనది. భక్తుల అనుభవాలే వాటికి ప్రబల సాక్ష్యాలు.

చాలా సంవత్సరాల క్రితం పరమాచార్య స్వామివారు కాశీయాత్ర చేస్తున్నప్పుడు, దాదాపు నెలరోజులపాటు చెంగల్పేట్ లో మకాం చేశారు. అప్పుడు మహాస్వామివారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ, చాలా నీరసించిపోయారు. పరమాచార్య స్వామివారు సాంప్రదాయ సన్యాసి మరియు పీఠాధిపతి కావడంతో వారిని తాకి సేవచేయ్యడం కుదరని పని. అలాంటి సమయంలో ఈ పని చేయ్యడంకోసమే అన్నట్టుగా ఒక సంఘటన జరిగింది.

అప్పట్లో మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి తన ఇష్టప్రకారం సన్యసించారు. అక్కడి నుండి రామేశ్వరానికి యాత్రకు వచ్చారు. ప్రయాణంలో తన దండాన్ని పోగొట్టుకున్నారు. శాస్త్రం పరకారం సన్యాసి తన దండాన్ని పోగొట్టుకుంటే, దాన్ని వేరొక సన్యాసి నుండే స్వీకరించాలి. రామేశ్వరం వెళ్తూ, దండంకోసమని పరమాచార్య స్వామి వద్దకు వచ్చాడు.

నియమం ప్రకారం మహాస్వామివారు మరొక దండాన్ని అతనికి ఇచ్చారు. దాన్ని స్వీకరించిన తరువాత సాక్షాత్తు పరమేశ్వరుడే ఇచ్చాడని భావించాడేమో, మహాస్వామి వారిని గురువుగా భావించి, సంపూర్ణ శరణాగతి చేసి, శ్రీవారి వద్దనే ఉండిపోయాడు.

ఆయన మహాస్వామివారికంటే పెద్దవాడు. అతను సన్యాసి కావడంతో, మహాస్వామి వారిని తాకి సేవచేసుకునే భాగ్యం పొందాడు. ప్రతిరోజూ స్వామివారి పాదపద్మాలకు పూలు సమర్పించేవాడు. స్వామివారితో పాటు కాశీయాత్రకు బయలుదేరాడు.

శ్రీమఠం క్యాంపు తిరుపతి చేరుకుంది. మహాస్వామివారు చాలా వేగంగా నడిచేవారు. వారి నడక వేగాన్ని అందుకోవడం ఎవరికి సాధ్యమయ్యేది కాదు. ఈ మహారాష్ట్ర స్వామిని వదిలి వేగంగా కాలినడకన మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్ళారు స్వామివారు. దర్శనం ముగించుకుని బయటకు వచ్చారు.

అప్పటికి మహారాష్ట్ర స్వామి ఇంకా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈయన దర్శనానికి రాలేదని మహాస్వామివారు నొచ్చుకుని దేవాలయ అధికారులను పిలిచి, మహారాష్ట్ర స్వామికి దర్శనం చేయించాల్సిందిగా తెలిపారు.

మహారాష్ట్ర స్వామిని అధికారులు దర్శననికి రమ్మని సాదరంగా ఆహ్వానించగా, అందుకు ఆయన తెలిపిన సమాధానం విని ఆశ్చర్యపోయారు.

“ఇప్పుడే ఇక్కడే నేను దర్శనం చేసుకున్నాను... ఇక మనం బయలుదేరుదాం” అని చెప్పారు.

“ఏమిటి? దర్శనం చేసుకున్నారా? ఎప్పుడు? ఎలా?” అని ఆసక్తిగా అడిగారు.

“అవును! దర్శనం చేసుకున్నాను! లోపలకు వెళ్ళే బాలాజిని దర్శనం చేసుకోవాలా? పరమాచార్య స్వామివారు ఆలయం నుండి వెలుపలికి రాగానే, ఆయన నాకు బాలాజీ లాగా దర్శనం ఇచ్చారు. నేను బాలాజీ దర్శనం చేసుకున్నాను” అని చెప్పారు మహారాష్ట్ర స్వామి.

ఇది వినగానే అందరూ రోమంఛితులయ్యారు. ఇలా చెప్పి దేవాలయం ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు ఆ స్వామి. సత్యం ఏంటో అందరూ అర్థం చేసుకున్నారు. అంతదూరం నుండి తిరుమల దేవాలయం ముందుకు వచ్చి కూడా ఆయన దర్శనం చేసుకోకపోయినా, ఇటువంటి మహాత్ముల వల్లనే, పరమాచార్య స్వామి అవతారం బహిర్గతమైంది.

--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి

https://t.me/paramacharyavaibhavam
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List