పరిక్రమ ప్రయోజనాలు ~ దైవదర్శనం

పరిక్రమ ప్రయోజనాలు

పరిక్రమ యొక్క లోతైన ప్రాముఖ్యం ఏమిటంటే భక్తుడు అక్కడి బాహ్యమైన తీర్థం లేదా పర్వతాన్ని చూడడు, కానీ అక్కడ ప్రత్యక్షమై, కొలువై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని చూస్తాడు. భగవద్గీతలోని పదవ అధ్యాయం ద్వారా, అలాంటి ప్రత్యేకస్థలాల్లో దైవత్వం ఎంతగా ఉందో మీకు అర్ధమవుతుంది. శ్రద్ధతో కూడిన విశ్వాసం మరియు ఆరాధన ద్వారా, పవిత్ర స్థలంలోని ఆధ్యాత్మిక స్పందనల మీలోనికి ప్రవేశించేందుకు మిమ్మల్ని మీరు గ్రహణశీలం చేసుకుంటారు. ఈ శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు స్థూల, సూక్ష్మ మరియు అన్ని కోశాల్లోకి ప్రవేశించి చెడు వాసనలను, సంస్కారాలను నశింపజేస్తాయి. తమోగుణం మరియు రజోగుణం తగ్గుతాయి. కేంద్రీకృతమైన సత్త్వగుణం నిద్రాణమైన ఆధ్యాత్మిక వాసనలను జాగృఅతపరుస్తుంది. పరిక్రమ ద్వారా, ఆ ప్రదేశమంతా వ్యాపించి ఉన్న ఆధ్యాత్మిక వాతవరణాన్ని భక్తుడు బాగా స్వీకరించి, సత్త్వంతో తడిసిన ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు. ఇది పరిక్రమ చేయడంలోని నిజమైన ఆంతర్యము మరియు ప్రాముఖ్యత.

గొప్ప శుద్ధినిచ్చేది కనుక, అది ఒక విధమైన ఉన్నతమైన సంప్రదాయానికి చెందిన తపస్సుగా భక్తులకు ఆజ్ఞాపించబడింది. ఇది గొప్ప ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మరియు పుణ్యాన్నిచ్చే కర్మ. భక్తుడు స్నానమాచరించి, శుభ్రమైన బట్టలు ధరించి, తిలకం లేదా పవిత్రభస్మం ధరించి, తులసి లేదా రుద్రాక్ష మాల వేసుకుని, భగవన్నామాన్ని పెదవులతో పలకడం మొదలుపెడతాడు. పరిక్రమ మార్గంలో, అక్కడ నివసించే సన్యాసులు మరియు సాధ్వుల విలువైన సత్సంగం మీకు లభిస్తుంది. పవిత్రనదుల్లో లేదా తటాకాలు, కుండాల్లో స్నానమాచరించడం వలన మీ పాపాలు నశిస్తాయి. ఆ మార్గంలో ఉన్న ఎన్నో పవిత్ర క్షేత్రాలు మరియు ఆలయాల సందర్శన ద్వారా మీరు ఉన్నతమైన స్థితిని పొందుతారు. ఎండ, వాన, చలి మొదలైన అసౌకర్యాలను తట్టుకోవడం ద్వారా మీలో ఓపిక మరియు సహనశీలత పెరుగుతుంది. మీ మనస్సు అన్ని ఆలోచనల నుంచి ముక్తి పొంది, దైవం యొక్క ఉనికి అనే ఆలోచనలో మీరు లీనమవుతారు. భక్తితో చేసిన పరిక్రమ అనే ఒక కర్మ త్రివిధమైన సాధనగా మీ దేహం, మనస్సు మరియు ఆత్మలను ఉద్ధరిస్తుంది. పవిత్ర ప్రదేశాలు మరియు ఆలయాల్లోని ఆధ్యాత్మిక ప్రతిస్పందనలను మీలోని సహజమన ఆసూరి వృత్తులను శుద్ధి చేసి, సత్త్వాన్ని, పవిత్రతను నింపుతాయి. మీరు సత్సంగానికి వెళ్ళాల్సిన పనిలేదు. మహాపురుషులే మీ వద్దకు వస్తారు. వారెప్పుడు నిజమైన మరియు నిజాయతీగల సాధకుల కోసం అన్వేషణలో ఉంటారు. అందుకే వారు పవిత్రస్థలాలైన బధ్రీ, కేదార్, కైలాసపర్వతం, హరిద్వార్, బృందావనం, మథుర మొదలైన క్షేత్రాల్లో కూడా ఉంటారు.

పరిక్రమలో పాల్గోనేెవారు అదృష్టవంతులు, ఎందుకంటే వారు త్వరగా శాంతిని, పరమానందాన్ని, మోక్షాన్ని పొందుతారు! అయోధ్యకు అధిపతి అయిన శ్రీ రామునకు జయము! బృందావనంలో ప్రత్యేకంగా ఉండేవాడు, హృదయనివాసి అయిన శ్రీ కృష్ణునకు జయము! భక్తులకు జయము! వాళ్ళ ఆశీస్సులు మీపై ఉండుగాకా! 
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List