* ప్రత్యేక వైశిష్ట్యాం సంతరించుకొన్న కార్తీక రెండో సోమవారం...
* కైలాసవాసునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక కోటి సోమవారము....
* కోటి ఆశలు తీరే సమయం..!
* కోటి సోమవారము - కోటి సోమవారముల ఫలము
* కైలాసవాసునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక కోటి సోమవారము....
* కోటి ఆశలు తీరే సమయం..!
* కోటి సోమవారము - కోటి సోమవారముల ఫలము
కైలాసవాసుడైన పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకం. హిందువులు ఎంతో ప్రవిత్ర మాసం భావించే ఈ కార్తీక మాసం అనేక విశిష్టతలను తీసుకొచ్చింది.. ఈ సారి కార్తీక మాసం ఐదు సోమవారాలు… మూడో సోమవారం కార్తీక పున్నమి.. అంతేకాదు.. ఈ సారి రెండో సోమవారం అనగా రేపు సోమవారం ఎన్నడూ లేని ఓ ప్రత్యేకను సంతరించుకొన్నది.. సప్తమీ తిధి.. శ్రవణ నక్షత్రం కలిసి వస్తుంది.. ఈ తిధి, నక్షత్రం కలిసి రావడం అరుదు అంటే.. ఇక సోమవారం రావడం మరీ అరుదు… ఇలా వచ్చే సోమవరంని కోటి సోమవారం అని అంటారు..
సృష్టికి లయకారుడైన పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం ఎన్నో విశిష్ఠతల సంగమం. ఈ రోజు నియమ, నిష్ఠలతో ప్రాత:కాలముననే ధనికులు, పేదవారు, బాలలు, వృద్దులు, స్త్రీ, పురుషులనెడి బేధము లేకుండా నదీ స్నానమాచరించి, నుదుట విభూధిని ధరించి పరమేశ్వరునికి ప్రీతికరమైన బిల్వదళములతో అర్పించిన, అభిషేకించిన కోటి జన్మల దరిద్రములు తొలగి సుఖశాంతములతో, సిరిసంపదలతో వర్థిల్లుతారు.
కోటి సోమవారం నాడు ఉపవాసం చేస్తే సదాశివుడు భక్తులకు మోక్షదామం ప్రసాదిస్తాడు. పునర్జన్మ లేకుండా స్వర్గలోక వాసం కల్పిస్తాడు అని పెద్దల ఉవాచ! కార్తీక మాసం లో ఉపవాస దీక్ష పాటించిన వారు ఎల్లప్పుడూ హరిహరుల రక్షణ లో వుంటారు. ఈ రోజు ఉపవాసం చేస్తే.. కోటి సోమవారాలు ఉపవాస దీక్ష చేసిన ఫలితం వస్తుంది.. దీంతో ఇతర కారణాలతో లేదా పరిస్థితులు అనుకూలించిక మిగతా సోమవారాలు చేయలేని వారు.. ఈ ఒక్క సోమవారం ఉపవాస దీక్ష తీసుకున్నా ఫలితం అందుకుంటారు అని పండితులు వెల్లడించారు.. చాలా పవిత్రమైన ఈ కోటి సోమవారం ఏ దైవకార్యం చేసినా ఎంతో పుణ్యం మూట కట్టుకోవచ్చు. ప్రత్యేకించి ఉపవాసానికి ఈ రోజు మిక్కిలి విశిష్టమైంది. ఈ రోజు ఉపవాస దీక్షతో పాటు శివ కేశవులిద్దరినీ ఆరాధించవచ్చు.
No comments:
Post a Comment