గ్రహ లగ్న వర్గోత్తమ ఫలితాలు ~ దైవదర్శనం

గ్రహ లగ్న వర్గోత్తమ ఫలితాలు

జ్యోతిష శాస్త్రానుసారం వర్గోత్తమ అనగా నవగ్రహాలలో ఏదేని ఒక గ్రహము లేదా లగ్నము  రాశి నవాంశ ల యందు ఒకే ఇంటియందు (అదే రాశి) స్థితి పొంది ఉండుట.

జ్యోతిష శాస్త్రానుసారం వర్గోత్తమ స్థితి కలిగిన గ్రహములు రెట్టింపు ఫలితములు ఇచ్చును లేదా జీవితముయోక్క ద్వితీయార్ధము (40 సంవత్సరములు లేక ఆ పైన వయస్సు) నుంచి మహా యోగమును ఇచ్చునట్లు చెప్పబడినది.

వర్గోత్తమ ఇన్నిరకాలు గా వుంటుంది
*1) వర్గోత్తమ* - గ్రహాలు రాశి నవాంశ ల లో ఒకే ఇంటియందు (అదే రాశి) యందు ఉండుట
*2) లగ్న వర్గోత్తమ* - లగ్నము రాశి నవాంశ ల లో ఒకే ఇంటియందు (అదే రాశి) యందు ఉండుట
*3) ఉచ్చ వర్గోత్తమ* – ఉచ్చ గ్రహము రాశి నవాంశ ల లో ఒకే ఇంటియందు (అదే రాశి) యందు ఉండుట
*4) నీచ వర్గోత్తమ* – నీచ గ్రహము రాశి నవాంశ ల లో ఒకే ఇంటియందు (అదే రాశి) యందు ఉండుట

ఫలితాను సారం వివిధ వర్గోత్తమ బలములు ఈ విధం గా వుంటాయి

*1) లగ్న వర్గోత్తమ* – (అత్యంత బలీయమైనది మరియు అత్యంత శుభకరము)
*2) ఉచ్చ వర్గోత్తమ* – (అత్యంత బలీయమైనది మరియు శుభకరము)
*3) వర్గోత్తమ* - (బలీయమైనది మరియు శుభకరము)
*4) నీచ వర్గోత్తమ* – (సామాన్య బలము మరియు శుభకరము)

వర్గోత్తమ స్థితి కలిగిన గ్రహమూలు మరియు లగ్నాధిపతుల దశ అంతర్దశ లలో జాతకునికి మహా యోగము కలుగునని చెప్పబడినది. పైన చెప్పినట్లు కొంత మందికి జీవిత ప్రధమార్ధమునందు ఏమీ యోగములు లేనట్లు సామాన్యులు గా సంచరించిననూ ద్వితీయార్ధము నందు ఇతరులు కానీ ఆఖరికి వారు కూడా నమ్మలేని స్థితి ని భోగ భాగ్యాలను పొందడం మనము చూచి ఉంటాము. వర్గోత్తమ స్థితి అంత బలీయమైనది మరియు శుభకరము

నీచగ్రహములు వర్గోత్తమ స్థితి వల్ల కొంత వరకు వారి దశ అంతర్దశలలో జాతకునికి వారు ఇచ్చే చెడుని కొంత మేరకు తగ్గించి సామాన్య ఫలితములు ఇచ్చునని  చెప్పబడింది

*గమనిక*: నీచగ్రహములు వర్గోత్తమ స్థితి పొందడం వల్ల నీచ భంగ రాజయోగము కలుగదు. దీనికి కారణం రాజయోగములు అన్నియు, రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహ కలయిక వీక్షణల వాల్ల కలుగుతాయి కనుక. వర్గోత్తమ అనునది నవాంశ చక్రమును అనుసరించి చెప్పబడుతుంది. నవాంశ ను జ్యోతిష్యులు ఏదేని గ్రహము లేదా లగ్నము యొక్క నిజ బలమును విశ్లేశిన్చుటకు మాత్రమే పరిశీలించేదరు అని మరిచిపోకూడదు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List