పుణ్యఫలం కోసం "కార్తీక వ్రతాన్ని" ఆచరించండి. ~ దైవదర్శనం

పుణ్యఫలం కోసం "కార్తీక వ్రతాన్ని" ఆచరించండి.

పూర్వము నైమిశారణ్యంలో సూతమహాముని.. శౌనకాది మహామునులకు కార్తీక మాస మహాత్మ్యము, ఎన్నో విష్ణుభక్తుల చరిత్రలు, మహిమలను వినిపించారు. ప్రజలు కలియుగంలో సంసారసాగరమున మునిగి భగవానుడిని స్మరించలేక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు మోక్షమార్గమేదని శౌనకాది మహామునులు... సూతమహామునిని ఈ సందర్భంగా అడిగారు. మానవునికి గల ఈ అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేదని, ముక్తినొసంగు ఉత్తమదైవమెవరని వారు సూతమునిని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు సూతమహాముని సమాధానమిస్తూ... క్షణికమైన సుఖభోగాల కోసం పరితపిస్తున్న మానవులకు ఈ కార్తీకమాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైందని చెప్పారు. దీనిని ఆచరించడం ద్వారా జన్మజన్మల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరని ఆ మహా ముని వెల్లడించారు.

ఇటువంటి కార్తీక వ్రతాన్ని గురించి "స్కంద పురాణమున" ఇట్టు చెప్పబడి ఉంది.

*"న కార్తీక సమో మాసః న దేవః కేశాతర్పమ్*
*న చ వేద సమం శాస్త్రం, న తీర్థం, గంగాయాన్యమమ్"*

ఈ కార్తీక మాసమునకు సమానంగా... విష్ణు దేవుడు, వేదములు, శాస్త్రములు, పుణ్యప్రదమైన తీర్థములు గానీ ఏవీ లేవని పురాణం చెబుతోంది.

ఈ మాసములో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవని, నెలమొత్తం... లేదా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లోనైనా పవిత్రపుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాసదీక్షలు చేస్తూ... మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత సహస్ర నామ పారాయణలు, ప్రతి నిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేసే వారికి విశేష పుణ్యఫలం లభిస్తుందని ఆర్యుల విశ్వాసం. ఇలా... ఈ కార్తీక మాస ముప్ఫై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని శాస్రోక్తం.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List