యెాగములు. ~ దైవదర్శనం

యెాగములు.

(1)సరస్వతి యెాగము:- శుభ గ్రహము లైన గురు,శుక్ర,బుధలు 1,2,4,5,7,9,10 స్థానములలో ఏ స్థానమున అయినను వుండి గురుడు ఉచ్చ రాశి యందు గాని మిత్ర క్షేత్రము నందు గాని వున్నచో సరస్వతి యెాగము కలుగును.
ఈ యెాగము వలన కవులు,పండితులు,అనేక శాస్త్రములు చదివినవారు,నేర్పు, మంచి కళత్రము లవారును అగుదురు.

(2)త్రిలోచన యెాగము:- రవి,చంద్ర,కుజులు పరస్పర త్రికోణ రాశులలో వుండినచో త్రిలోచన యెాగము వర్తించును.
ఈ యెాగము వలన శతృవులకు సింహస్వప్నం వలె నుండుట,ధన సంపాదన, మానసిక బలము,తెలివి తెలివితేటలు,శతృవులపై విజయము సాధించువారును,మంచి ఆరోగ్యము,ఐశ్వర్యము కలవారును అగుదురు
.
(3)కేమద్రుమ యెాగము:- చంద్రడున్న స్థానమునకు 2,12 స్థానముల యందు గ్రహములు లేకుండుట వలన కేమద్రుమ యెాగము కలుగ గలదు.
ఈ యెాగము వలన విరుద్దమైన వృత్తులు యందు వుండుట,దుష్ట వేషముల నవలంబించుట,దారాపుత్ర సంపద లేకుండుట,మలినులు,విదేశములందు నివసించు వారునుఅగుదురు.

చంద్రుడున్న స్థానమునకు 2,12 స్థానములందు గ్రహములు లేనప్పటికిని,పాప శుభ గ్రహములలో యేగ్రహములచే నైనను చంద్రడు చూడబడిన కేమద్రుమ యెాగగము భంగమై జాతకులను చక్రవర్తిని,ధీర్ఘాయుష్మంతుని చేయును.
చంద్రుడున్న స్థానమునకు 2,12 స్థానములయందు ఏ గ్రహములు లేనప్పటికీ  4 కేంద్రముల యందు పాప,శుభ గ్రహములు ఏవియున్నను కేమద్రుమ యెగము భంగమై "కల్పద్రుమ"యెాగము కలుగును.ఈ యెాగము వలన జాతకులకు ఎల్లప్పుడూ శుభ ఫలితములు కలుగును.

జన్మకాలమందు తులారాశి లో గురు కుజు లను, కన్యారాశిలో రవి యుండి, మేషరాశి యందుడు చంద్రనకు(బుధ,శని,శుక్రులు)ఇతర గ్రహ ధృష్ఠి వున్నప్పుడు కేమద్రుమ యెాగము భంగమగును. శుక్రుడు,బుధుడు,గురుడు కలసి లగ్నమునకు కేంద్ర స్థానముల యందున్నను,చంద్రుడు పూర్ణుడైనను ఆ చంద్రునకు కేంద్రములందు గ్రహములున్నను కేమద్రుమ యెాగ ఫలితములుండవు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List