నవంబర్ 5 ధనత్రయోదశి. నవంబర్ 4 వ తేది సాయంత్రం నుంచే త్రయోదశి గడియలు ప్రారంభమవుతున్నాయి. ధనత్రయోదశి నాడు ఇంటి ముంగిళ్ళలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీ దేవి ఇంటికొస్తుంది, యముడు మీ వైపు చూడడు. ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఈ పర్వదినానినే ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి.
ధనత్రయోదశి రోజున ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది. అందుకే సంపద దేవుడు అయిన కుబేరుడుతో పాటు లక్ష్మీదేవిని ఈ ధనత్రయోదశి రోజును పవిత్రమైన రోజుగా పూజిస్తారు. అయితే లక్ష్మీపూజ అమావాస్య రోజున మరియు ధనత్రయోదశి రెండు రోజుల్లోను మరింత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున నరకాసుని చెర నుండి మహాలక్ష్మిని విడుదల చేసి ఆమెని ధనమునకు మూలదేవతగా వుంచుతారు మహావిష్ణువు.
ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. ఈ శుభదినాన వెండి – బంగారం కానీ, ఒకటి రెండు కొత్త పాత్రలు కానీ కొంటే అదృష్టం వస్తుందని నమ్మకం. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.
ధనత్రయోదశి నాడు ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు కాలంలో లక్ష్మీదేవీ పూజ శ్రేష్ఠం. ప్రదోషకాలంలో, అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం. నవంబర్ 5వ తేదీ సాయంత్రం నుంచే త్రయోదశి మొదలవుతుంది. సాయంత్రం ఏడు తరువాత నుంచి స్థిర లగ్నమైన వృషభ లగ్నం. కావున ఆ రోజు 7 గంటల 15 నిమిషాల నుంచి 8:30 గంటల మధ్య సమయంలో ధనత్రయోదశి పూజ చేయడం విశేష ఫలప్రదమని సూచన.
ధనత్రయోదశి నాడు లక్ష్మీ దేవిని భక్తితో పూజించాలి. తీపి వంటల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు. వ్యాపారస్థులు – గృహస్థులు తమ ప్రాంగణాల్ని శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి. శుచిగా, శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఈ తల్లిని స్వాగతిస్తూ గుమ్మంలో అందమైన ముగ్గులు వేయాలి. దీపాలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ఇంట్లో కాలుమోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యప్పిండి, పసుపుతో బుడిబుడి అడుగుల గుర్తులు వేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, రాత్రి మొత్తం దీపాలు వెలుగుతూనే ఉండాలి.
అట్లే పరిపూర్ణ ఆయువు కోసం ధనత్రయోదశి నాడు యమధర్మరాజును పూజించాలి. ఈ దినాన సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాల్ని వెలిగించాలి. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కావున ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమ దీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.......
ధన త్రయోదశి... ఈ దీపం అక్కడ వెలిగిస్తే జీవితమే మారిపోతుంది...🌺
5 నవంబర్2018 ధన త్రయోదశి. ధన్వంతరి పుట్టినరోజును ధనత్రయోదశి అంటారు. ఆ రోజు ధన్వంతరికి పిండి దీపం పెడితే ఎంతో మంచిది. చాలామంది ధనత్రయోదశి రోజు పిండి దీపం పెడుతుంటారు. నిజానికి పిండి దీపం ఎందుకు పెడుతుంటారో చాలామందికి తెలియదు.
గోధుమ పిండితో ఒక ప్రమిదను తయారుచేయాలి. దాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి. పచ్చిపిండిలో నూనె పోయరాదు. అది దీపానికి పనిచేయదు. ఆరిన తరువాత ఆవనూనె పోసి ఒత్తులు వెలిగించాలి. అది కూడా 6 నుంచి 7 గంటల మధ్య సాయంత్రం సమయంలో వెలిగించాలి. అందులో నూనె 4 గంటల నుంచి 5 గంటల వరకు వెలిగేలా చూసుకోవాలి.
ఇంటి గుమ్మం కి ఇరువైపుల దీపారాధన వెలిగించడం ఉత్తమం అని శాస్త్రం చెప్పడం జరిగింది....
ఈ దీపాన్ని యముడి కోసం వెలిగిస్తారు. మృత్యువు నుంచి, మృత్యు భయం పోవాలని దీపాన్ని వెలిగించాలి. పిండి దీపం మన చేత్తో మనమే తయారుచేస్తాము కాబట్టి సంవత్సరమంతా ఎవరిని ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకూడదని, అలాగే సంవత్సరమంతా "ధన, ధాన్యాలతో సుఖసంతోషాలతో జీవించేలా కాపాడమని యముడిని కోరతాం."
నాలుగు ఒత్తులు పెట్టి నాలుగు దిశల్లో కోరడం వల్ల ఎటువైపు నుంచి దుష్ట శక్తి అయినా మాపైకి వస్తే మీరే కాపాడాలని ఆ ఒత్తులను వెలిగిస్తాం. ఆరోగ్యంగా ఉండటానికి ధన్వంతరి అభయమిస్తారు. ఇప్పుడు అర్థమైందా.. పిండి దీపం ఎందుకో.. ఆ దీపం వల్ల కలిగే లాభాలు ఏమిటో
🌺పరమిదలో దీపం వెలిగించడం ద్వారా "నవగ్రహాలను" కొలిచి ఆయా "గ్రహప్రభావ దోషాలను" తొలగిస్తుంది .🌺
ఏ దేవునికైనా ప్రమిదలో దీపమెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు!
ప్రమిద, అందులోని నూనె, వత్తులు, కాంతికి, నవగ్రహాలకు సంబంధం వుంది .
ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని శాస్త్ర వచనం .
1. ప్రమిద దీపం ...సూర్యుడు
2. నెయ్యి , నూనె- ద్రవపదార్థం ..చంద్రుడు .
3. వత్తులు ..బుధుడు ..
4. ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల .. అంగారకుడు .
5. ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన రాహువును సూచిస్తుంది .
6. జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు .
7. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి సంకేతం
8. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే కాంతి- ఇది జ్ఞానం .. కేతువుకు సంకేతం
9. ప్రమిదలోని వత్తులు తరుగుతూ రావడానికి శుక్రుడు సంకేతం . శుక్రుడు ఆశకు కారకుడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది .
తమసోమా జ్యోతిర్గమయా .!
ఆశలతో మానవజన్మ సార్థకం కాదని , తద్వారా మోక్షం లభించడం కష్టమని , తిరిగి తిరిగి మానవుడు ఆశల ద్వారా కర్మలు చేసుకుంటూ పోతూ , విషయవాసనల చక్రంలో బందీ అవుతాడు .

No comments:
Post a Comment