పాత దీపాలను పడవేయకండి ~ దైవదర్శనం

పాత దీపాలను పడవేయకండి

దీపాలు పాతవి అయిపోతే చాలా మంది వాటిని మార్చేస్తారు , ఎపుడో ఒకసారి దీపాలు పెట్టె వాళ్ళు ఎలా చేసుకున్న పర్వాలేదు కానీ నిత్యం దీపారాధన చేసుకునే ఆడవాళ్లు ఆ పాత దీపాలను మార్చుకోకూడదు 

మరి పాతావి దేవుడి ముందు బాగలేదు అనుకుంటే అవి తులసి కోట దగ్గర అయినా పెట్టండి లేదా కాలం చేసిన పెద్దవారి ముందు అయినా పెట్టండి కానీ పాతవి అయిపోయింది అని మూలన పెట్టకండి, మార్చకండి .

ఎందు కంటే మన కుటుంబంలో మనుషులుగా మనతో దీపాలకు కూడా ఒక బంధం ఉంటుంది, అవి బొమ్మలు కాదు ప్రత్యక్షంగా దైవస్వరూపాలు, మన సంతోషాలు కష్టాలు, కనీళ్లు, బాధ్యతలు పంచుకున్న మన ఆప్తులతో సమానం, మనము ఒక కష్టాన్ని భగవంతుడు కి చెప్పుకుంటే మన పూజ గదిలో దీపాలు కూడా భగవంతుడు ని ప్రార్తిస్థాయి, మనము సంతోషం గా దీపం పెట్టి పూజ చేసి నప్పుడు భగవంతుడు కి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి.

 

దీపం లో నూనె అయిపోతే కొండెక్కి పోతుంది అనుకుంటారు ఆ ప్రమిద చివరి భాగంలో గూడు కట్టిన మసిలో దీపం ఇంటి యజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలుకి తోడుగా ఉంటుంది, ఆమె భర్త బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరాలి అని భగవంతుడు ని ప్రతిస్తూ ఉంటాయి అంటారు... అందుకే చాలా కాలం గా పూజించిన దీపాలకు కూడా చాలా విలువ ఉంటుంది మహిమ ఉంటుంది.. ప్రాణంవుంటుంది...పాత దీపాలు అనుకోకుండా శుభ్రంగా ఉంచి వాడుకోండి .

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List