వంకాయ రంగు రిబ్బనులు ధరించి ఘనంగా మహిళాదినోత్సవం. ~ దైవదర్శనం

వంకాయ రంగు రిబ్బనులు ధరించి ఘనంగా మహిళాదినోత్సవం.

అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమలగురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటన గా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు యూరప్, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో, ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం మరియు వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో, ఐక్యరాజ్యసమితి ఉద్దేశించినవిధంగా రాజకీయ మరియు మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ మరియు సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచేవిధంగా జరుపుతారు.
ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరించి హిళాదినోత్సవం జరుపుకుంటారు.
ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగో లో మే 3, 1908; న్యూయార్క్ లో ఫిభ్రవరి 28, 1909 మరియు ఫిభ్రవరి 27, 1910 రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగష్టు 1910 లో, అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది.అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు. 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకుఓటుహక్కుతో పాటు సమాన హక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు తదుపరి సంవత్సరం మార్చి 19, 1911న పదిలక్షలమందిపైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలలో మార్చి 19, 1911 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి. వియన్నా లో రింగ్ స్ట్రాసె లో ప్రదర్శన చేశారు. మహిళలు ఓటుహక్కు మరియు ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు. అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనేవున్నారు.
భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్‌ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు మరియు మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం మరియు నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List